29 ప్రాంతాలు టార్గెట్‌గా ఉగ్రవాదుల కుట్ర!

Top Targets Of The Terror Groups In Delhi - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌-పాక్‌ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను నిఘా వర్గాలు పసిగట్టాయి. మొత్తం 29 ప్రాంతాలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందనే సమాచారం నిఘా సంస్థలకు అందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారనే సమాచారంతో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. టార్గెట్‌ జాబితాను విడుదల చేసిన అధికారులు ప్రజలకు, రాజకీయ నాయకులకు పలు సూచనలు చేశారు. రాజకీయ పార్టీల కార్యాలయాలతో పాటు, రిటైర్డ్‌ ఆర్మీ, పోలీసు అధికారుల నివాసాలు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి...(అభినందన్‌ విడుదలపై మరో మలుపు)

టార్గెటెడ్‌ ప్రాంతాలు:
1. నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజ్
2. సేనా భవన్‌, 
3. ఇస్రాయిల్‌ ఎంసీ
4. యూకే, యూఎస్‌ఏ ఎంబసీ
5. ఇండియా గేట్‌
6. ప్రధాన న్యాయమూర్తి నివాసం
7. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ పార్కింగ్‌ ఏరియా
8. రాష్ట్రపతి భవన్‌
9. ఢిల్లీ రైల్వే స్టేషన్‌,
10. ఢిల్లీ యూనివర్సిటీ
11. ఎయిమ్స్‌
12. అక్షర్‌ధామ్‌ టెంపుల్‌
13. రెడ్‌ ఫోర్ట్‌ పరిసరాలు
14. పార్లమెంట్‌
15. విదేశాంగ శాఖ కార్యాలయం 
16. ఐఐటీఎఫ్‌
17. మెయిన్‌ బజార్‌(పహర్‌ గంజ్‌)
18. మాల్స్‌, సినిమా హాల్స్‌
19. విదేశాలకు చెందిన ఎంబసీ అధికారులు పర్యటించే ప్రదేశాలు
20. దిల్లీ హాట్‌, ఐఎన్‌ఏ మార్కెట్‌
21. పలికా బజార్‌
22. చాందినీ చౌక్‌
23. సరోజని నగర్‌ మార్కెట్‌
24. సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టు
25. లక్ష్మీనారాయణ్‌ టెంపుల్‌
26. లోటస్‌ టెంపుల్‌
27. మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌
28. కుతుబ్‌ మినార్‌
29. రెడ్‌ ఫోర్ట్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top