ప్రాణం మీదకి తెచ్చిన నూడుల్స్‌ చట్నీ

Three Yearold Consumes spicy Noodle Chutney, gets Lung Damage - Sakshi

న్యూఢిల్లీ : నూడుల్స్‌ అంటే  చిన్నా పెద్దా అంతా ఎగబడి మరీ  లాగించేస్తారు.  అయితే నోరూరించే చట్నీతో నూడుల్స్‌  తిన్న మూడేళ్ల  చిన్నారి ప్రాణం మీదకి  తెచ్చుకున్నాడు.  నూడుల్స్‌తో అందించే  స్పైసీ చట్నీని  ఆరగించి, తీవ్ర అనారోగ్యం పాలైన బాలుడు  దాదాపు చావు అంచుల వరకు వెళ్లి  తృటిలో బయట పడ్డాడు.

హర్యానాకు చెందిన మజూర్  కుమారుడు ఉస్మాన్‌ నూడుల్స్ లో వేసే చట్నీ అంటే ప్రాణం. ఎంత ప్రాణం అంటే కప్పుల కొద్దీ దాన్ని లాంగించేంత.  ఒక రోజుసాయంత్రం ఎప్పటిలాగే   నూడుల్స్‌తో పాటు కప్‌ చట్నీని ఆబగా ఆరగించేశాడు.  అంతే ఇక ఆ  రాత్రి ఉస్మాన్ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభించింది. ఉస్మాన్‌ శరీరం నలుపు రంగులోకి మారింది. బీపీ పూర్తిగా పడిపోవడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఊపిరితిత్తులు పాడయ్యాయని గుర్తించారు. వెంటనే అతడికి వెంటిలేటర్‌పై వైద్యం  అందించారు. దాదాపు 16 రోజులపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించి బాలుడికి తిరిగి  ప్రాణం పోశారు.

అయితే స్ట్రీట్‌ ఫుడ్‌లో  అమ్మకందారులు, నూడుల్స్ , ఇతర ఆహార పద్దార్థాల్లో రుచి కోసం  వాడే  ఎసిటిక్ యాసిడ్ దీనికి కారణమని  వైద్యులు తేల్చారు.  ఇది మోతాదు మించితే ఆరోగ్యానికి హానికరని చెప్పారు.  అదే బాలుడి ప్రాణాలమీదకితెచ్చిందని స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top