అతడి పైనుంచి 3 రైళ్లు వెళ్లాయి!

Three Trains Pass Over Madhya Pradesh Man - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో రైలు పట్టాలపై ఓ వ్యక్తి పడివున్నాడు. అతడి పైనుంచి మూడు రైళ్లు కూడా వెళ్లిపోయాయి. అతడు చనిపోయాడనుకుని పోలీసులు వచ్చి చూడగా సదరు వ్యక్తి లేచి కూర్చుకోవడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ‘మా నాన్న వస్తాడు’ అంటూ అతడు చెప్పడంతో  పోలీసులు గందరగోళానికి గురయ్యారు.

అసలేం జరిగింది?
రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం పడివుందని లోకోమోటివ్‌ పైలట్‌(రైలు డ్రైవర్‌) ఒకరు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చేసరికే ఆ మార్గంలో మూడు రైళ్లు వెళ్లడంతో అతడు చనిపోయివుంటాడని భావించారు. తాము అతడిని తరలిచేందుకు ప్రయత్నించగా స్పృహలోకి వచ్చి తన తండ్రి వస్తాడని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అతడి పేరు ధర్మేంద్ర అని మద్యం సేవించి అతడు రైలు పట్టాల మధ్యలో నిద్రపోయాడని వెల్లడించారు. అతడి పైనుంచి మూడు రైళ్లు వెళ్లిన విషయం చెప్పగానే మద్యం మత్తు దిగిపోయిందన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ధర్మేంద్రను ఇంటికి పంపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top