కోల్కతాలో ముగ్గురు ఐఎస్ఐ ఏజెంట్ల అరెస్ట్ | Three arrested for links to Pakistan's ISI | Sakshi
Sakshi News home page

కోల్కతాలో ముగ్గురు ఐఎస్ఐ ఏజెంట్ల అరెస్ట్

Nov 29 2015 8:23 PM | Updated on Sep 3 2017 1:13 PM

కోల్కతాలో ముగ్గురు ఐఎస్ఐ ఏజెంట్ల అరెస్ట్

కోల్కతాలో ముగ్గురు ఐఎస్ఐ ఏజెంట్ల అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులను ఆదివారం కోల్కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

కోల్కతా: పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులను ఆదివారం కోల్కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఓ కంపెనీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న ఇర్షాద్ అన్సారి (51), అతని కొడుకు అస్ఫాక్ అన్సారి (23), బంధువు మహ్మద్ జహంగీర్లను దక్షిణ కోల్కతా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్టు సీనియర్ ఎస్టీఎఫ్ అధికారి చెప్పారు.

నిందితుల నుంచి డాక్యుమెంట్లు, భారత నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇర్షాద్, జహంగీర్లు పదేళ్లుగా ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్టు ఎస్టీఎఫ్ అధికారి చెప్పారు. దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్నట్టు తెలిపారు. కాగా బీఏ రెండో సంవత్సరం చదువుతున్న అస్ఫాక్ పాత్రపై ఇంకా నిర్ధారించాల్సివుందని చెప్పారు. నిందితులు పలుమార్లు పాక్కు వెళ్లారని, అక్కడ ఐఎస్ఐ వారికి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ఐఎస్ఐలో వీరి పాత్ర గురించి విచారిస్తున్నట్టు ఎస్టీఎఫ్ అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement