ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా రురా అనే గ్రామంలో దొంగలు ఏకంగా ఏటీఎమ్ ను ఎత్తుకెళ్లారు.
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా రురా అనే గ్రామంలో దొంగలు ఏకంగా ఏటీఎమ్ ను ఎత్తుకెళ్లారు. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన ఈ మిషన్ను పగులగొట్టి అందులో ఉన్న 18,800 రూపాయల నగదును దోచుకెళ్లారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.
గ్రామస్తుల సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రైవేట్ కంపెనీ ఏటీఎమ్ కేంద్రం వద్ద గార్డును నియమించలేదని పోలీసులు చెప్పారు. దొంగలు ఏటీఎమ్ను ఓ వాహనంలో తీసుకెళ్లారని, ముగ్గురు కంటే ఎక్కువమంది ఈ పనికి పాల్పడి ఉంటారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.