ఐదురోజులుగా ముమ్మర గాలింపు చేపడుతున్నా.. అదృశ్యమైన వాయుసేన ఏఎన్32 విమానం జాడ దొరకలేదు.
ఐదో రోజూ కనిపించని విమానం
చెన్నై/న్యూఢిల్లీ : ఐదురోజులుగా ముమ్మర గాలింపు చేపడుతున్నా.. అదృశ్యమైన వాయుసేన ఏఎన్32 విమానం జాడ దొరకలేదు. నౌకా, వైమానిక, తీరరక్షక దళాలకు తోడు ఇస్రో రంగంలోకి దిగినా పురోగతి కనిపించలేదు. గాలింపు చర్యలకు అధికారులు ‘ఆపరేషన్ తలాష్’ పేరు పెట్టారు. మారిషస్‌కు వెళ్లిన సాగర్ నిధి అనే అత్యాధునిక నౌక మంగళవారం చెన్నై చేరుకుంది. దీని సాయంతో నేవీ లోతైన సముద్ర ప్రాంతానికి వెళ్లి గాలింపు పనుల్లో నిమగ్నమైంది.
‘ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఢిల్లీలో చెప్పారు. విమానం అదృశ్యంపై రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించాయి.