
దటీజ్ కర్నాటక!
కర్నాటక ప్రభుత్వం మాతృభాషకు పెద్దపీట వేయనుంది.
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం మాతృభాషకు పెద్దపీట వేయనుంది. కన్నడ మాధ్యమంలో చదవిన స్థానికులకే ఉద్యోగావకాశాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గతంలో ప్రకటించారు. ఆ మాటలకు కట్టుబడి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. .ప్రభుత్వ గుర్తింపును ఆశించే ప్రతి విద్యా సంస్థలోనూ ఒకటి నుంచి నాలుగో తరగతి వరకూ విధిగా కన్నడ మాధ్యమంలోనే బోధన ఉండాలని 1994లోనే కర్ణాటక ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే.
మాతృభాషపై మక్కువ పెంచే చర్యల్లో భాగంగా ఇప్పుడు కన్నడ మాధ్యమంలో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.