కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది.
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. పీపీఏ, కృష్ణా జలాల అంశాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తమ వాదనలు వినిపించారు.
ఈఆర్సీ ఆమోదించిన పీపీఏలను మాత్రమే కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ సర్కార్, కృష్ణా ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాల వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వ సీఎస్ హోంశాఖ కార్యదర్శిని కోరారు. ఇక హైదరాబాద్లో గవర్నర్ అధికారాలపై ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో రాజుకుంటున్న వివాదాల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించిన విషయం తెలిసిందే.