‘విడాకుల యుద్ధం.. భారతం కన్నా పెద్దది’

Tej Pratap Yadav Said Divorce Battle Bigger Than Mahabharat - Sakshi

పట్నా : విడాకుల యుద్ధం మహాభారత యుద్ధం కంటే పెద్దదంటున్నారు బిహార్‌ మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌. తాజాగా విడాకుల విషయంలో తేజ్‌ ప్రతాప్‌  వెనక్కి తగ్గినట్లు  వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ పుకార్లే అని తేల్చేశారు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌. ఈ సందర్భంగా తల్లి రబ్రీ దేవితో విడాకుల గురించి చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. విడాకుల విషయంలో నేను ఇప్పటికి నా అభిప్రాయానికే కట్టుబడి ఉన్నాను. ఈ నెల 8న విడాకులకు సంబంధించిన లీగల్‌ అంశాల విచారణ ప్రారంభం అవుతుంది. అయితే ఈ విడాకుల అంశం అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేలా లేదు. విడాకులు పొందడం కోసం మహాభారతం కంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోందన్నారు.

‘ఈ విషయంలో మా అమ్మ నాకు పూర్తి మద్దతు తెలుపుతోంది. నా భార్యతో, ఆమె కుటుంబ సభ్యులతో ఇక ఎలాంటి సంబంధం ఉండాలని నేను కోరుకోవడం లేదు. ఐశ్వర్య కుటుంబంతో ఉన్న అన్ని బంధాలను తెంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ సందర్భంగా యాదవ కమ్యూనిటీకంతటికి ఒక విషయం విన్న విస్తున్నాను. నాకు, ఐశ్వర్యకు మధ్య ఎలాంటి బంధం ఉందో మీకు నిజంగా తెలీదు. ఈ విషయాల గురించి మీకు తెలిసిన రోజు మీరు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారని తెలిపాడు. ఈ ఎన్నికల్లో తాను తన తమ్ముడు తేజస్వి యాదవ్‌ కోసం పని చేస్తానని తెలపాడు. తేజస్వీనే కాబోయే సీఎం. అతనికి నా ఆశీర్వాదాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top