మార్కులు తక్కువగా రావడంతో దారుణం

Teacher Blackens Girls Face With Sketch Pen Over Poor Score - Sakshi

చండీగఢ్‌ : మార్కులు తక్కువగా వచ్చాయనే ఆగ్రహంతో నాలుగో తరగతి చదివే చిన్నారి ముఖంపై నల్లరంగు పూసి స్కూల్‌లో అందరి ముందూ తిప్పిన టీచర్‌ ఉదంతం హరియాణాలోని హిసార్‌లో వెలుగుచూసింది. టీచర్‌ చిన్నారిని హింసించడంతో బాలిక తల్లితండ్రులు స్కూల్‌ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు నిరసన చేపట్టారు. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రైవేట్‌ పాఠశాలను తక్షణమే మూసివేయాలని బాధిత బాలిక తండ్రి డిమాండ్‌ చేశారు.

ఈనెల 6న నిర్వహించిన పరీక్షలో తమ కుమార్తెకు మార్కులు తక్కువగా రావడంతో మహిళా టీచర్‌ తమ కుమార్తె ముఖానికి స్కెచ్‌ పెన్‌తో నల్లరంగు అద్దారని, స్కూల్‌ చుట్టూ తిప్పారని ఆయన ఆరోపించారు. చిన్నారికి పరీక్షలో మార్కులు తక్కువగా వచ్చినా టీచర్‌ ఇలా చేసి ఉండాల్సింది కాదని అన్నారు. మరోవైపు ఈ బాలికతో పాటు మరో ముగ్గురు బాలికల పట్ల కూడా మార్కులు తక్కువ వచ్చాయంటూ టీచర్‌ ఇదే తీరుగా వ్యవహరించారని విద్యార్ధులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top