ఒక్క టీ ఖరీదు.. రూ. 20 వేలు! | 'Tea with Arvind Kejriwal' at Rs 20,000 | Sakshi
Sakshi News home page

ఒక్క టీ ఖరీదు.. రూ. 20 వేలు!

Dec 26 2014 3:38 PM | Updated on Aug 11 2018 4:36 PM

ఒక్క టీ ఖరీదు.. రూ. 20 వేలు! - Sakshi

ఒక్క టీ ఖరీదు.. రూ. 20 వేలు!

టీ ఖరీదు సాధారణంగా ఎంత ఉంటుంది? మహా అయితే 5 నుంచి 10 రూపాయల లోపు. అదే స్టార్ హోటళ్లలో అయితే.. 50 రూపాయలు.

టీ ఖరీదు సాధారణంగా ఎంత ఉంటుంది? మహా అయితే 5 నుంచి 10 రూపాయల లోపు. అదే స్టార్ హోటళ్లలో అయితే.. 50 రూపాయలు. అదే.. అరవింద్ కేజ్రీవాల్తో కలిసి టీ తాగాలనుకుంటే మాత్రం మీరు రూ.20వేలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తమ ఎన్నికల ఖర్చుల కోసం నిధులు సేకరిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే భోజనాల పేరుతో విరాళాలు వసూలుచేసిన ఆప్ నేతలు.. ఇప్పుడు ఈ టీ విరాళం మొదలుపెట్టారు. ఢిల్లీ న్యాయశాఖ మాజీమంత్రి సోమ్నాథ్ భారతి ఇంట్లో తేనీటి విందు ఏర్పాటుచేశారు. దాంతో పాటు.. ఆమ్ ఆద్మీ పార్టీకి విరాళాలు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో జరిగిన విరాళాల కార్యక్రమాల్లో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement