breaking news
high tea
-
అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు సేవకులు: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు సేవకులని ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. మంగళవారం సాయంత్రం విజయవాడ ఏప్లస్ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ‘‘దేవుడు మన నుంచి ఆశించేది ఒక్కటే. అధికారం అనేది అధికారం కాదు. అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు సేవకులు. ఇంకా ప్రజలకు ఒదిగి ఉండాలి అని గుర్తు పెట్టుకోవాలి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో తాను ఈ స్థానంలో ఉన్నానని, ఇంకా గొప్ప సేవ చేసే అవకాశం తనకు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్. ఇంకా ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ముగిసిన తేనీటి విందు
-
ఒక్క టీ ఖరీదు.. రూ. 20 వేలు!
టీ ఖరీదు సాధారణంగా ఎంత ఉంటుంది? మహా అయితే 5 నుంచి 10 రూపాయల లోపు. అదే స్టార్ హోటళ్లలో అయితే.. 50 రూపాయలు. అదే.. అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి టీ తాగాలనుకుంటే మాత్రం మీరు రూ.20వేలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తమ ఎన్నికల ఖర్చుల కోసం నిధులు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భోజనాల పేరుతో విరాళాలు వసూలుచేసిన ఆప్ నేతలు.. ఇప్పుడు ఈ టీ విరాళం మొదలుపెట్టారు. ఢిల్లీ న్యాయశాఖ మాజీమంత్రి సోమ్‌నాథ్ భారతి ఇంట్లో తేనీటి విందు ఏర్పాటుచేశారు. దాంతో పాటు.. ఆమ్ ఆద్మీ పార్టీకి విరాళాలు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో జరిగిన విరాళాల కార్యక్రమాల్లో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు.