మాయావతికి ఎదురుదెబ్బ 

Tax Officials Attach Rs 400 Crore Plot Belonging To Mayawati Brother - Sakshi

రూ.400 కోట్ల ఆస్తిని ఎటాచ్‌ చేసిన  ఐటీ అధికారులు

లక్నో: బీఎస్‌పీ చీఫ్‌ మాయావతికి  ఎదురుదెబ్బ తగిలింది. మాయావతి సోదరుడు,  బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌, అతని భార్యకు చెందిన 400 కోట్ల రూపాయల ఆస్తులను  ఆదాయ పన్నుశాఖ ఢిల్లీ విభాగం  ఎటాచ్‌ చేసింది.

బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం, 1988 ప్రకారం జులై 16న  తాత్కాలిక నోటీసులు జారీ చేశామని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.  నోయిడాలో ఏడు ఎకరాల్లో విస్తరించిన వున్న ప్లాట్‌ను బినామీ ఆస్తిగా పరిగణించిన ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీని విలువ  సుమారు రూ. 400 కోట్లు.  కాగా బినామీ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి ఏడు సంవత్సరాల వరకు కఠినమైన జైలు శిక్ష లేదా బినామి ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం వరకు జరిమానా  విధించే అవకాశం ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top