రోడ్డు ప్రమాదంలో ఏడుగురు టెకీల దుర్మరణం | Tanker driver held for collision with bus; 7 techies killed | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు టెకీల దుర్మరణం

Jul 3 2017 3:59 PM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు టెకీల దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు టెకీల దుర్మరణం

పూణే-అహ్మద్‌నగర్‌ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు చనిపోయారు.

పూణే: పూణే-అహ్మద్‌నగర్‌ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు దుర్మరణం చెందారు. ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలివీ.. వేర్వేరు ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 13 మంది ఇంజనీర్లు మినీ బస్సులో అహ్మద్‌నగర్‌లో జరిగిన స్నేహితుని వివాహ వేడుకలో పాల్గొని మినీ బస్సులో తిరిగి వస్తున్నారు. వారి వాహనం ఫూణేకు నలబై కిలోమీటర్ల దూరంలో ఉన్న లోనికండ్‌ గ్రామం సమీపంలో ఉండగా ఎదురుగా వేగంగా వచ్చిన ట్యాంకర్‌ ఢీకొట్టింది.
 
అనంతరం ఆ వెనుకే ఉన్న మరో బస్సును కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ బస్సుల్లో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళా ఇంజినీర్లు కూడా ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో టెకీ సోమవారం మృతిచెందారు.
 
అంతేకాదు, బస్సులో ఉన్న ఓ వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. ట్యాంకర్‌ డ్రైవర్‌ కృష్ణ కితర్వాడ్‌(22) నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అతడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిపై వివిధ సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement