పీఎస్‌ఎల్‌వీ-సీ28 కౌంట్‌డౌన్ షురూ | Tamilmurasu - PSLV - C-28 rocket was launched this morning at the | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఎల్‌వీ-సీ28 కౌంట్‌డౌన్ షురూ

Jul 9 2015 1:29 AM | Updated on Sep 3 2017 5:08 AM

పీఎస్‌ఎల్‌వీ-సీ28 కౌంట్‌డౌన్ షురూ

పీఎస్‌ఎల్‌వీ-సీ28 కౌంట్‌డౌన్ షురూ

అంతరిక్ష వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఐదు బ్రిటన్ ఉపగ్రహాలను నింగికి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టనున్న...

శ్రీహరికోట(సూళ్లూరుపేట): అంతరిక్ష వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఐదు బ్రిటన్ ఉపగ్రహాలను నింగికి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ28 రాకెట్ ప్రయోగానికి బుధవారం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా షార్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఇస్రో ఈ నెల 10న పీఎస్‌ఎల్‌వీ-సీ28ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగానికి గాను షార్‌లో బుధవారం ఉదయం 7:38 గంటలకు కౌంట్‌డౌన్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

మొత్తం 62.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం శుక్రవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ28 నింగిలోకి దూసుకుపోనుంది. కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా బుధవారం రాకెట్‌లోని నాలుగోదశ(పీఎస్-4)లో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు. కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. గురువారం రాకెట్‌లోని అన్ని సాంకేతిక తలను పరిశీలిస్తారు. శుక్రవారం ఉదయం రాకెట్‌లోని రెండోదశలో (పీఎస్-2) 42 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపుతారు. ఆ తర్వాత రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి రాకెట్‌ను ప్రయోగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement