షూటింగ్‌లకు ‘సర్కార్‌’ గ్రీన్ సిగ్నల్‌‌ | Sakshi
Sakshi News home page

అక్కడ మొదలవనున్న షూటింగ్‌లు

Published Thu, May 21 2020 1:01 PM

Tamil Nadu Goverment Give Permission to Shooting - Sakshi

చెన్నై: కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడి వారు అక్కడే పరిమితమయ్యారు. దీంతో కార్యకలాపాలన్ని అటకెక్కాయి. ఇంట్లో ఉన్న వారికి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇ‍చ్చే సినిమా షూటింగ్‌లు, సిరీయల్‌ షూటింగ్‌లు కూడా లేకపోవడంతో టీవీ కార్యక్రమాలు కూడా ఎక్కడిక్కడ ఆగిపోయాయి. వరుసగా విడుదల అవ్వాల్సిన సినిమాలు కూడా ఆగిపోయాయి. ఇప్పటికి నాలుగుసార్లు లాక్‌డౌన్‌ను పొడిగించినప్పటికి ఈసారి కొన్ని సడలింపులను కేంద్రప్రభుత్వం ఇచ్చింది. దీంతో తమని కూడా షూటింగ్‌లకు అనుమతించాలని తమిళ ప్రొడ్యూసర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. దీంతో కొద్ది మందితో ఒక చిన్న స్థలంలో షూటింగ్‌లు చేసుకోవడానికి తమిళనాడు సర్కార్‌ అనుమతినిచ్చింది. అయితే కేంద్రప్రభుత్వ నియమనిబంధనలకు లోబడే షూటింగ్‌లు చేయాలని ఆదేశించింది. దీంతో ఇక నుంచి తమిళనాడుతో షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. (పోస్ట్మ్యాన్లతో కూరగాయల సరఫరా )

Advertisement
 
Advertisement