ఎల్‌జీయే ఢిల్లీకి బాస్‌

Supreme Court Says Lieutenant Governor Has Primacy In Delhi - Sakshi

ఆర్టికల్‌  239ఏఏ ఇదే చెబుతోందన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ)కే ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే రాజ్యాంగంలోని 239ఏఏ ఆర్టికల్‌ ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం కంటే ఎల్‌జీకే ఎక్కువ అధికారాలుంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం వెల్లడించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఎల్‌జీతో రోజూ ఘర్షణ తప్పట్లేదని.. మంత్రులంతా అధికారుల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆప్‌ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

దీనిపై విచారించిన ధర్మాసనం.. ‘ఆర్టికల్‌ 239ఏఏ ఢిల్లీకే ప్రత్యేకం. రాజ్యాంగ పరిధిలో ఈ చట్టం ఎల్‌జీకే విశిష్టాధికారాలు కట్టబెట్టింది’ అని పేర్కొంది. ‘రాష్ట్రపతికి ఉండే పలు అధికారాలు ఢిల్లీలో ఎల్‌జీకి ఉంటాయని చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే, మంత్రుల సలహాలతో ఎల్‌జీ పనిచేయాల్సి ఉంటుంది. వీరి ఆలోచనలతో విభేదిస్తే.. సమస్యల త్వరిత పరిష్కారం కోసం ఆయన రాష్ట్రపతి దృష్టికి సదరు విషయాన్ని తీసుకెళ్లాలి’ అని ధర్మాసనం స్పషం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top