సుప్రీంకోర్టులో కర్ణాటకకు ఎదురుదెబ్బ | Supreme Court red signal to 'Karnataka origin' criterion for Govt seats in PG Medical courses | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో కర్ణాటకకు ఎదురుదెబ్బ

Apr 5 2018 2:04 AM | Updated on Oct 9 2018 6:57 PM

Supreme Court red signal to 'Karnataka origin' criterion for Govt seats in PG Medical courses - Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో మెడికల్, డెంటల్‌ కోర్సుల్లో పీజీ చేయాలనుకునేవారు రాష్ట్రంలో స్థిరనివాసం కలిగిఉండాలంటూ ప్రభుత్వం జారీచేసిన సమాచార బులెటిన్‌లోని నిబంధన చెల్లదని జస్టిస్‌ అరుణ్‌మిశ్రా, జస్టిస్‌ యుయు లలిత్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ నిబంధనను సవరించి బులెటిన్‌ను మళ్లీ విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్, కర్ణాటక ఎగ్జామినేషన్స్‌ అథారిటీలను ఆదేశించింది. అలాగే పరీక్షల క్యాలెండర్‌ను పునఃప్రచురించాలని సూచించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement