వేదాలు గొప్పవని హాకింగే చెప్పారు

Stephen Hawking said theory in Vedas superior to Einstein's E=mc2: Science minister - Sakshi

 కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్‌  

ఇంఫాల్‌: ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం(ఉ=ఝఛి2) కంటే మెరుగైన సిద్ధాంతం వేదాల్లో ఉన్నట్లు కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖమంత్రి  హర్షవర్ధన్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల కన్నుమూసిన ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ ఈ విషయాన్ని చెప్పారన్నారు. ఇంఫాల్‌లో 105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్షవర్ధన్‌ మాట్లాడారు. ‘ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం కంటే మెరుగైన సిద్ధాంతం మన వేదాల్లో ఉండొచ్చని హాకింగ్‌ గతంలో పత్రికాముఖంగా తెలిపారు’ అని చెప్పారు.

సమావేశం అనంతరం ఈ వాదనలకు ఆధారమేంటని విలేకరులు ప్రశ్నించగా.. వాటిని కనుక్కోవాల్సిన బాధ్యత మీదేనన్నారు. ‘హిందూ మతంలోని ఆచార, సంప్రదాయాల్లో సైన్స్‌ మెండుగా ఉంది. ఆధునిక భారత్‌లో ప్రతీ ఆవిష్కరణ మన పూర్వీకులు సాధించిన వాటికి కొనసాగింపే’ అని సమావేశం అనంతరం హర్షవర్ధన్‌ ట్వీట్‌ చేశారు. ఇంతకుముందు 2015లో ముంబైలో జరిగిన 102వ సైన్స్‌ కాంగ్రెస్‌లోనూ భారత్‌లో 7,000 ఏళ్ల క్రితం విమానాలు ఉండేవనీ, వాటిద్వారా ప్రజలు వేర్వేరు దేశాలకు, గ్రహాలకు వెళ్లేవారని వేదాల్లో ఉన్నట్లు ఓ పత్రాన్ని దాఖలుచేయడం వివాదానికి దారితీసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top