నీట్పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన పలు రాష్ట్రాలు | states objection on NIT | Sakshi
Sakshi News home page

నీట్పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన పలు రాష్ట్రాలు

May 3 2016 3:10 PM | Updated on Sep 2 2018 5:45 PM

సుప్రీంకోర్టులో నీట్పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నీట్పై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకాశ్మీర్ సహా పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

హైదరాబాద్ : సుప్రీంకోర్టులో నీట్పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నీట్పై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకాశ్మీర్ సహా పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాల వాదనపై సమాధానం ఇవ్వాలని ఎంసీఐ, కేంద్ర ఆరోగ్యశాఖకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. నీట్ ప్రారంభంలో ఇలాంటి బాలరిష్టాలు సహజమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

నీట్పై అభ్యంతరాలు తెలపాలనుకుంటే పిటిషన్లు అవకాశం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అన్నింటిపైనా గురువారం అభ్యంతరాలు వింటామని సుప్రీం స్పష్టం చేసింది. రేపే ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉండటంతో కర్ణాటక వాదనలను త్రిసభ్య ధర్మాసనం వింటోంది. కర్ణాటక వాదనలతోపాటు తమిళనాడు వాదనలు త్రిసభ్య ధర్మాసనం వింటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement