వందేళ్లలో ఈ ‘అగ్ని వలయం’ లోతైనది!

Solar Eclipse 2020 Is A Deepest Annular Ring Of Fire Over A Century - Sakshi

న్యూఢిల్లీ: ఆకాశంలో ఆదివారం అద్భుత ఖగోళ సంఘటన కనువిందు చేసింది. భారత్‌వ్యాప్తంగా పలు చోట్ల పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం కనిపించింది. దేశవ్యాప్తంగా ఉదయం 9 గంటలకు ప్రారంభమైన గ్రహణం మూడు గంటల వరకు కొనసాగింది. ఈఏడాది ఇది మూడో గ్రహణం కావడం విశేషం. ఇప్పటికే జనవరి, జూన్‌ మాసాల్లో రెండు చంద్రగ్రహణాలు కనిపించాయి. సరిగ్గా మధ్యాహ్నం 12.05 నిముషాలకు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే మార్గంలోకి రావడంతో.. అగ్నివలయంగా సూర్యుడు దర్శనమిచ్చాడు.

గుజరాత్‌లో సూర్యగ్రహణం

ఈ శతాబ్దానికి ఇదే ‘లోతైన’ వలయాకార సూర్యగ్రహణమని జ్యోతిష్కులు, నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ దశాబ్దానికి ఇది చివరి వలయాకార సూర్యగ్రహణమని పేర్కొన్నారు. దాంతోపాటు నేటి సంపూర్ణ, వలయాకార సూర్యగ్రహణం ఖగోళ చరిత్రలో నాలుగో అత్యుత్తమైందని అంటున్నారు. కాగా, ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, భువనేశ్వర్‌, కోల్‌కత, లక్నో, ముంబై, పట్నా, షిల్లాంగ్‌, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణం కనిపించింది. ఆసియా, ఆఫ్రికా, పసిఫిక్‌, హిందూ మహాసముద్రాల ప్రాంతాల్లో, యూరప్‌, ఆస్ట్రేలియాలోనూ గ్రహణం కనిపించింది.
(చదవండి: అగ్ని వలయంలో బీజేపీ ఎంపీ యోగా)

పంజాబ్‌‌లో పాక్షిక సూర్యగ్రహణం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top