మొరాయించిన ట్విట్టర్‌ | social media twitter hang over | Sakshi
Sakshi News home page

మొరాయించిన ట్విట్టర్‌

Aug 22 2019 4:05 AM | Updated on Aug 22 2019 4:05 AM

social media twitter hang over - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్‌ మీడియా వేదిక ట్విట్టర్‌ బుధవారం రాత్రి గంటపాటు మొరాయించింది. రాత్రి 8 గంటల సమయంలో ఈ పరిస్థితి ఎదురైందని పలువురు ట్విట్టర్‌ యూజర్లు తెలిపారు. కేవలం భారత్‌లోని కొందరు యూజర్లు ఈ పరిస్థితి ఎదుర్కొన్నారని ట్విట్టర్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఆండ్రాయిడ్‌లో నెట్‌వర్క్‌ సమస్య వల్ల ఖాతాలను తెరవడంలో సమస్య ఎదురైందని దాన్ని సరిదిద్దామన్నారు. ఇప్పుడు ట్విట్టర్‌ సజావుగా పని చేస్తోందని తెలిపారు. మొరాయించిన ఒక్క గంటలోనే 2,764 ఫిర్యాదులు అందడం గమనార్హం. భారత్‌లో ట్విట్టర్‌కు 3.4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement