సోషల్‌ మీడియా ‘లీడర్‌’ మోదీ | Social media 'Leader' Modi | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా ‘లీడర్‌’ మోదీ

Jan 20 2017 3:08 AM | Updated on Aug 21 2018 9:33 PM

సోషల్‌ మీడియా ‘లీడర్‌’ మోదీ - Sakshi

సోషల్‌ మీడియా ‘లీడర్‌’ మోదీ

బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోతుండటంతో సామాజిక మాధ్యమాల్లో ప్రపంచంలోనే ఎక్కువ మంది

న్యూఢిల్లీ: బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోతుండటంతో సామాజిక మాధ్యమాల్లో ప్రపంచంలోనే ఎక్కువ మంది అనుసరిస్తున్న రాజకీయ ప్రముఖునిగా భార త ప్రధాని మోదీ నిలవనున్నారు. ఫేస్‌బుక్, ట్వీటర్, యూట్యూబ్, గూగుల్‌ ప్లస్‌ ఇలా అన్నింటిలో మోదీకే అందరు దేశాధినేతల కన్నా ఎక్కువ మంది ఫాలోవర్లున్నారని పీఎంఓ వర్గాలు తెలిపాయి.

ట్వీటర్‌లో మోదీకి సుమారు 2.6 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 3.92 కోట్లు, గూగుల్‌ ప్లస్‌లో సుమారు 30 లక్షలు, లింక్డ్‌ఇన్ లో సుమారు 20 లక్షల మంది ఫాలోవర్లున్నారని వెల్లడిం చాయి. సుమారు కోటి డౌన్ లోడ్‌లున్న ప్రధాని యాప్‌ కూడా ఎక్కువ మంది వాడుతున్న రాజకీయ నాయకుడి యాప్‌గా పేర్గాంచింది. ప్రధాని ఈ యాప్‌ ద్వారానే ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నారు

Advertisement
 
Advertisement
Advertisement