రాహుల్‌ ఒక విఫల రాజవంశీయుడు... | Smriti Irani hit out at Rahul Gandhi over his remarks on dynasty | Sakshi
Sakshi News home page

రాహుల్‌ ఒక విఫల రాజవంశీయుడు...

Sep 12 2017 4:15 PM | Updated on Sep 19 2017 4:26 PM

రాహుల్‌ ఒక విఫల రాజవంశీయుడు...

రాహుల్‌ ఒక విఫల రాజవంశీయుడు...

బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ ఉపాధ్యాక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తప్పుబట్టారు.

న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ ఉపాధ్యాక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తప్పుబట్టారు. రాహుల్‌ ఒక విఫల రాజవంశీయుడని విమర్శించారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో తన విఫల రాజకీయం గురించి చెప్పుకోవడమే దారుణమని, విదేశాల్లో ప్రధాని నరేంద్రమోదీని తక్కువ చేస్తూ మాట్లడటం​సహించరానిదని ఆమె స్పష్టం చేశారు.  కుటుంబ రాజకీయలపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.
 
భారత్‌లో ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను చూస్తే  కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయా లేదా అన్నది రాహుల్‌కు అర్ధమవడం లేదా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లోనే భారత ప్రజలు గాంధీ కుటుంబ రాజకీయాలకు చరమగీతం పట్టారని,  ప్రధాని నరేంద్రమోదీని అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఈ సందర్భంగా ఆమె స్పష్టంచేశారు.  అంత పెద్ద వేదికపై నేతల అహంకారమే కాంగ్రెస్‌ను దెబ్బతీసిందని రాహుల్‌ అనడమే దారుణమని స్మృతి ఇరానీ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement