‘ఓసారి వ్యాయామం చేయాలనుకున్నా.. కానీ’

Smriti Irani Begins Monday With Hilarious Workout Meme - Sakshi

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అనగానే గుర్తొచ్చేది ఆమె వాక్చాతుర్యం. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్‌గా ఉంటూ నెటిజన్లకు ఎదో రకంగా మెసేజ్‌ ఇస్తుంటారు. కుటుంబం, రాజకీయాలకు సంబంధించిన విషయాలతోపాటు ఇతర ఎన్నో అంశాలను నెటిజన్లతో పంచుకుంటూ.. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ప్రత్యేకంగా వివరిస్తారు. తాజాగా మరో ఆసక్తికర విషయంతో స్మృతి వార్తల్లో నిలిచారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో  ఓ ఫన్నీ మీమ్‌ను షేర్‌ చేశారు. 

గతంలో స్మృతి వ్యాయమం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ నిర్ణయం వల్ల ఆమెకు కొన్నిసమస్యలు తలెత్తడంతో వెంటనే వ్యాయామాన్ని మానేశారు. ఇంతకు ఏం జరిగిందంటే..‘‘నేను ఒకసారి వ్యాయామం చేయడం మొదలు పెట్టాను. అ తరువాత నాకు ఎలర్జీ రావడం మొదలైంది. నా చర్మం అంతా ఉబ్బిపోయింది. అలాగే గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది. విపరీతమై చెమటతో ఆయాసం వచ్చేది. చాలా ప్రమాదకరంగా అనిపించింది.’’అని హస్యస్పదమైన పోస్ట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top