‘స్మార్‌‌ట’గా డీఎన్‌ఏ టెస్టింగ్ | 'Smarta as DNA testing | Sakshi
Sakshi News home page

‘స్మార్‌‌ట’గా డీఎన్‌ఏ టెస్టింగ్

May 10 2015 2:01 AM | Updated on Nov 6 2018 5:26 PM

‘స్మార్‌‌ట’గా డీఎన్‌ఏ టెస్టింగ్ - Sakshi

‘స్మార్‌‌ట’గా డీఎన్‌ఏ టెస్టింగ్

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చేయలేని పని అంటూ ఏదీ లేదేమో.

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చేయలేని పని అంటూ ఏదీ లేదేమో. అంతగా పెరిగిపోయింది దీని టెక్నాలజీ. తాజాగా ఈ పనుల జాబితాలోకి మరొకటి చేరింది. అదే డీఎన్‌ఏ స్కానింగ్! అవును నిజమండి బాబు..! లాస్ ఏంజిలెస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు త్రీడీ ప్రింటర్‌తో తయారు చేసిన ఓ అటాచ్‌మెంట్‌ను తగిలించుకుంటే చాలు.. ఎలాంటి స్మార్ట్‌ఫోనైనా డీఎన్‌ఏ మైక్రోస్కోపుగా మారిపోతుంది.

వీటితో కేన్సర్ నుంచి అల్జీమర్స్ వరకూ మనకు వచ్చే ప్రమాదమున్న అనేక రకాల వ్యాధుల  గురించి ముందుగానే తెలుసుకోవచ్చు. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. డీఎన్‌ఏ పోగులకు రంగులు అద్ది లేజర్ల సాయంతో ఉత్తేజితం చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. డీఎన్‌ఏ పోగులో పదివేల కంటే ఎక్కువ బేస్‌పెయిర్స్ ఉన్నప్పుడు ఈ పరికరం చక్కగా పనిచేసింది. త్వరలోనే దీన్ని మలేరియా నిరోధకతను పరీక్షించేందుకు ఉపయోగించనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement