భక్తురాలి కౌగిలింతతో ప్రాణాలు కోల్పోయిన స్వామీజీ! | Sivananda Swami passes away | Sakshi
Sakshi News home page

భక్తురాలి కౌగిలింతతో ప్రాణాలు కోల్పోయిన స్వామీజీ!

Jan 21 2015 3:24 AM | Updated on Sep 2 2017 7:59 PM

భక్తురాలి కౌగిలింతతో ప్రాణాలు కోల్పోయిన స్వామీజీ!

భక్తురాలి కౌగిలింతతో ప్రాణాలు కోల్పోయిన స్వామీజీ!

శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఓ భక్తురాలు పూజలో నిమగ్నమై ఉన్న కొప్పళ మఠం శివానంద స్వామీజీ(80)ని కౌగిలించుకోవడంతో ఇద్దరూ మృతి చెందారు.

బెంగళూరు (బనశంకరి) : శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఓ భక్తురాలు పూజలో నిమగ్నమై ఉన్న  కొప్పళ మఠం శివానంద స్వామీజీ(80)ని కౌగిలించుకోవడంతో ఇద్దరూ మృతి చెందారు. భక్తురాలు నిన్న మృతి చెందగా, స్వామీజీ ఈరోజు మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కర్ణాటకలోని  యలబుర్గి తాలూకా మటికట్టి గ్రామంలో శివానంద స్వామీజీకి చెందిన కొప్పళ మఠంలో  శరణమ్మ ప్రభావతి ప్రధాన శిష్యురాలిగా ఉంటోంది.  వారిద్దరి మధ్యవివాహేతర సంబంధం ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మఠం ఆస్తిలో తనకు భాగం ఇవ్వాలని ఆమె స్వామీజీని డిమాండ్ చేస్తూ వస్తున్నట్లు సమాచారం.

స్వామిజీ కాదనడంతో ఆమె సోమవారం శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని పూజలో ఉన్న స్వామీజీని కౌగిలించుకుంది.ఆమె నిన్ననే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శివానందస్వామీజీని బాగలకోటెలోని శ్రీకుమారేశ్వర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మంగళవారం  కన్నుమూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement