breaking news
koppala mattam
-
భక్తురాలి కౌగిలింతతో ప్రాణాలు కోల్పోయిన స్వామీజీ!
బెంగళూరు (బనశంకరి) : శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఓ భక్తురాలు పూజలో నిమగ్నమై ఉన్న కొప్పళ మఠం శివానంద స్వామీజీ(80)ని కౌగిలించుకోవడంతో ఇద్దరూ మృతి చెందారు. భక్తురాలు నిన్న మృతి చెందగా, స్వామీజీ ఈరోజు మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కర్ణాటకలోని యలబుర్గి తాలూకా మటికట్టి గ్రామంలో శివానంద స్వామీజీకి చెందిన కొప్పళ మఠంలో శరణమ్మ ప్రభావతి ప్రధాన శిష్యురాలిగా ఉంటోంది. వారిద్దరి మధ్యవివాహేతర సంబంధం ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మఠం ఆస్తిలో తనకు భాగం ఇవ్వాలని ఆమె స్వామీజీని డిమాండ్ చేస్తూ వస్తున్నట్లు సమాచారం. స్వామిజీ కాదనడంతో ఆమె సోమవారం శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని పూజలో ఉన్న స్వామీజీని కౌగిలించుకుంది.ఆమె నిన్ననే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శివానందస్వామీజీని బాగలకోటెలోని శ్రీకుమారేశ్వర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మంగళవారం కన్నుమూశారు. -
నిప్పంటించుకుని.. స్వామిని కౌగిలించుకుని..
బెంగళూరు(బనశంకరి): కర్ణాటకలోని కొప్పళ మఠంలో శరీరానికి నిప్పంటించుకున్న ఓ మహిళ మంటలు రేగుతుండగా స్వామీజీని కౌగిలించుకుంది. సోమవారం జరిగిన ఈ ఉదంతంలో మహిళ మరణించగా, స్వామీజీ తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. యలబుర్గి తాలూకా మటికట్టి గ్రామంలో శివానంద స్వామీజీకి చెందిన కొప్పళ మఠంలో ప్రధాన శిష్యురాలిగా ఉంటున్న శరణమ్మ ప్రభావతితో స్వామీజీకి వివాహేతర సంబంధం ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. మఠం ఆస్తిలో తనకు భాగం ఇవ్వాలంటూ స్వామీజీని ఆమె డిమాండ్ చేస్తూ వచ్చిందని సమాచారం. ఇందుకు స్వామి కాదనడంతో శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రభావతి.. పూజలో నిమగ్నమై ఉన్న స్వామీజీని కౌగిలించుకున్నట్లు తెలుస్తోంది.