సిద్ధూ వచ్చాకే ఉత్కంఠ వీడుతుంది! | Sidhu in america no decision yet on AAP: Wife | Sakshi
Sakshi News home page

సిద్ధూ వచ్చాకే ఉత్కంఠ వీడుతుంది!

Aug 25 2016 2:53 PM | Updated on Apr 4 2019 3:25 PM

సిద్ధూ వచ్చాకే ఉత్కంఠ వీడుతుంది! - Sakshi

సిద్ధూ వచ్చాకే ఉత్కంఠ వీడుతుంది!

మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ ఆప్‌లో చేరికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

చండీగఢ్: మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ ఆమ్‌ఆద్మీ పార్టీలో చేరికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సిద్ధూ ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున ఆప్‌లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన సతీమణి, బీజేపీ ఎమ్మెల్యే నవజోత్ కౌర్ బుధవారం వెల్లడించారు. ఓ కార్పోరేట్ సంస్థ ఉద్యోగులకు ప్రేరణ ఉపన్యాసం ఇవ్వడానికి గాను సిద్ధూ అమెరికాకు వెళ్లినట్లు కౌర్ తెలిపారు. సిద్ధూ తిరిగొచ్చాక ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించారు.
 
సిద్ధూ ఆప్‌లో చేరే విషయంలో జరుగుతున్న తాత్సారానికి కారణం ఆప్ పెట్టిన నిబంధనలే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఒకరికే టికెట్ అన్న నిబంధన సిద్ధూ ఫ్యామిలీకి మింగుడుపడటం లేదని సమాచారం. సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించాలనే డిమాండ్ సైతం సిద్ధూ ఆప్ ముందు ఉంచాడన్న మరో వాదన సైతం ఉంది. మరోవైపు కాంగ్రెస్ సైతం మాటకారి సిద్ధూతో పార్టీకి మేలు జరుతుందని భావిస్తూ.. అతడిని ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో సిద్ధూ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement