మధ్యప్రదేశ్‌ సీఎంపైకి చెప్పు?

SHOE HURLED AT MP CM SHIVRAJ SINGH CHOUHAN - Sakshi

సీధీ: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌పై చెప్పువిసిరినట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రమంతా ‘జన ఆశీర్వాద యాత్ర’ చేస్తున్న చౌహాన్‌ ఆది, సోమవారాల్లో యూపీ సరిహద్దుల్లోని సీధీ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల కొందరు నల్లజెండాలతో ఆయన బస్సుకు స్వాగతం పలికారు. ఓ చోట ఆయన బస్సుపై రాళ్లు రువ్వగా బస్సు అద్దాల్లో చీలిక వచ్చింది. పూజా పార్క్‌ ప్రాంతంలో ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా రికార్డు చేసిన వీడియోలో ఆయనపైకి చెప్పు విసిరిన దృశ్యం రికార్డయింది. నల్లజెండాలు చూపడంతోపాటు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top