నోట్ బుక్పై శిల్పాశెట్టి ఫోటో | shilpashetti photo on schoolbooks twitts renudeshai | Sakshi
Sakshi News home page

నోట్ బుక్పై శిల్పాశెట్టి ఫోటో

Jun 7 2015 4:42 PM | Updated on Sep 15 2018 5:32 PM

నోట్ బుక్పై శిల్పాశెట్టి ఫోటో - Sakshi

నోట్ బుక్పై శిల్పాశెట్టి ఫోటో

ప్రైవేట్ స్కూల్లో ఓ విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతనికి ఆ స్కూల్ వాళ్లు ఇచ్చిన పుస్తకాలపై శిల్పాశెట్టి, సన్నీలియోన్, బిపాసాబసు ఫోటోలు ముద్రించి ఉన్నాయి.

పూణే: పూణేలోని ఓ ప్రముఖ స్కూల్లో ఓ విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతనికి ఆ స్కూల్ వాళ్లు ఇచ్చిన పుస్తకాలపై శిల్పాశెట్టి ఫోటోలు ముద్రించి ఉన్నాయి. ఆ స్కూల్ ప్రిన్సిపల్ని ఈ అంశంపై కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే.. పిల్లలు టీవీల్లోనే ఆమెను చూస్తున్నారు కదా?.. పుస్తకంమీద చూస్తే తప్పేంటి అని సమాధానమిచ్చారు..
 
ఈ సంఘటన ప్రముఖ నటి ,నిర్మాత, దర్శకురాలు రేణుదేశాయ్కి తన మేనల్లుడు విషయంలో ఎదురైన అనుభవం. ఈ విషయాన్ని రేణుదేశాయ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరికొందరి పుస్తకాలపై సన్నీలియోన్, బిపాసాబసుల ఫొటోలు కూడా ఉన్నాయట. విద్యార్థుల పుస్తకాలపై ఇలాంటి ఫొటోలు ముద్రించడం చూస్తే విద్యకన్నా..వినోదానికే  ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement