స్కూల్‌ బ్యాగ్‌ ఎప్పుడు మొదలైంది? | When And Where Did The School Bag Originate? The History Of The School Bag From Cloth Bundles To Modern Backpacks | Sakshi
Sakshi News home page

School Bags History: స్కూల్‌ బ్యాగ్‌ ఎప్పుడు మొదలైంది?

May 30 2026 11:35 AM | Updated on May 30 2026 11:57 AM

When And Where Did The School Bag Originate? Full Details

ఓ... అవునా!

పిల్లలూ... మీరు రోజూ వీపు మీద వేసుకునే స్కూల్‌ బ్యాగ్‌కి పెద్ద చరిత్రే ఉంది. ఒకప్పుడు పిల్లలు పుస్తకాలు చేతిలో పట్టుకుని లేదా గుడ్డలో మూట కట్టుకుని బడికి వెళ్లేవారు. ఆ తర్వాత స్కూల్‌ బ్యాగ్‌ వచ్చింది. అయితే మొదటి బ్యాగ్‌ ఎవరు కనిపెట్టారు? దీనికి సరైన జవాబు లేదు. కానీ ‘మోడ్రన్‌ స్కూల్‌ బ్యాగ్‌’ అంటే భుజానికి వేసుకునే బ్యాగ్‌ను మొదట జర్మనీ దేశంలో తయారు చేశారు.

1850ల నాటికి జర్మనీలో పిల్లలు బళ్లకు వెళ్లడం ఎక్కువైంది. పుస్తకాలు, పలక, సుద్దముక్కలు మోయడం కష్టంగా ఉండేది. అప్పుడు సైనికులు వాడే ‘రాన్‌ జెన్‌’ అనే వీపు సంచిని చూసి 1870లో జర్మనీ షూ తయారీదారులు తోలుతో గట్టిగా ఉండే సంచులు చెయ్యడం మొదలుపెట్టారు. దాని పేరు ‘టోర్నిస్టర్‌’ లేదా ‘షుల్‌రాన్‌ జెన్‌’. అదే మొదటి స్కూల్‌ బ్యాగ్‌.  పుస్తకాలు నలగకుండా, వానలో తడవకుండా ఉండటానికి దిట్టంగా దీనిని తయారు చేసేవారు. అప్పట్లో పుస్తకాలు చాలా ఖరీదు. అందుకే అంత జాగ్రత్త.

అమెరికాలో 1938లో ‘జిప్పర్‌’ ఉన్న కాన్వాస్‌ బ్యాగ్‌లు వచ్చాయి. కానీ 1967లో ‘జాన్‌ స్పోర్ట్‌’ కంపెనీ ఈ రోజు మనం వాడే నైలాన్‌ బ్యాక్‌΄్యాక్‌ను స్కూల్‌ కోసం తయారు చేసింది. మన దగ్గర 1960 వరకు చాలామంది పుస్తకాలను టవల్‌లో, అల్యూమినియం పెట్టెలో పెట్టుకుని వెళ్లేవారు. 1980 తర్వాతే స్కూల్‌ బ్యాగులు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement