సూపర్‌ హిట్‌ తీస్తా – హను రాఘవపూడి | Sharwanand And Director Hanu Raghavapudi New Movie | Sakshi
Sakshi News home page

సూపర్‌ హిట్‌ తీస్తా – హను రాఘవపూడి

Nov 24 2017 1:11 AM | Updated on Nov 24 2017 1:11 AM

Sharwanand And Director Hanu Raghavapudi New Movie  - Sakshi

శర్వానంద్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ సినిమాస్‌ పతాకంపై ప్రసాద్‌ చుక్కపల్లి, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తోన్న చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో శర్వానంద్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్‌’ రాజు క్లాప్‌ ఇచ్చారు. కొరియోగ్రాఫర్‌ రాజు సుందరం కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు సుకుమార్‌ గౌరవ దర్శకత్వం వహించారు. హను రాఘవపూడి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథా చిత్రమిది. శర్వానంద్‌ క్యారెక్టరైజేషన్‌ కొత్తగా ఉంటుంది.

నా మిత్రులు ప్రసాద్, సుధాకర్‌ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందిస్తా’’ అన్నారు. ‘‘శర్వానంద్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెష్‌ సబ్జెక్ట్‌తో చాలా కొత్తగా హను రూపొందించనున్నారు. మా బ్యానర్‌లో నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రం హిట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది. త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌ స్టార్ట్‌ చేయనున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ వేడుకలో నిర్మాతలు వై. రవిశంకర్, ఎస్‌. రా«ధాకృష్ణ, అనీల్‌ సుంకర, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, బాపినీడు, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరకర్త.

Advertisement
 
Advertisement
Advertisement