తనను ఆలయంలోకి ప్రవేశించకుండా ఆరెస్సెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు పనికిరానివని ఆరెస్సెస్ కొట్టి పారేసింది.
న్యూఢిల్లీ: తనను ఆలయంలోకి ప్రవేశించకుండా ఆరెస్సెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు పనికిరానివని ఆరెస్సెస్ కొట్టి పారేసింది. కాంగ్రెస్ నేత నిర్మల్ ఖాత్రి నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు తమపై ఎప్పుడూ అసత్యపూరితమైన ఆరోపణలు చేయడం అలవాటైందని ఆరెస్సెస్ ప్రచారకర్త మన్మోహన్ వైద్య ట్వీట్ చేశారు.
ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నిత్యం తమపై ఆరోపణలు చేస్తుందని అన్నారు. చెన్నైలో ఓ ఆరెస్సెస్ ఉద్యమకారుడు వరద బాధిత చెన్నైలో సహాయక చర్యలకు భంగం కలిగిస్తున్నాడని మార్ఫింగ్ చేసిన ఫొటో పెట్టాడని, అనంతరం ఆ ఫొటో తొలగించి క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. ఆ చర్యపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేశారని అన్నారు. ఇలా ముందునుంచే పాతపద్దతిలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరెస్సెస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.