గుప్తా కుటుంబంపై రూ.2.5 లక్షల జరిమానా

Rs 2.5 lakh penalty on Gupta brothers for littering, open defecation - Sakshi

పెళ్లిళ్ల ఖర్చు రూ. 200 కోట్లు, చెత్తకు 2.5 లక్షల ఫైన్‌

డెహ్రాడూన్‌: దక్షిణాఫ్రికాకు చెందిన గుప్తా కుటుంబంపై జోషిమత్‌ మున్సిపాలిటీ రూ. 2.5 లక్షల జరిమానా విధించింది. పెళ్లి తర్వాత మిగిలిన చెత్తను ఖాళీగా ఉన్న చోట పడేయడంతో జరిమానా విధించినట్లు జోషిమత్‌ మున్సిపాలిటీ అధికారి సత్యపాల్‌ నౌతియాల్‌ తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని ఔలి స్కి రిసార్ట్‌లో జూన్‌ 20, 22న జరిగిన వారి ఇద్దరి కుమారుల పెళ్లిళ్లలో 321 క్వింటాళ్ల చెత్త పోగయింది. ఆ చెత్తను అలాగే వదిలేసినందుకు రూ. 1.5 లక్షలు, ఖాళీ స్థలంలో వేసినందుకు మరో లక్ష జరిమానా విధించింది. ఈ పెళ్లిళ్లకు దాదాపు రూ. 200 కోట్లు ఖర్చు చేశారు. పెళ్లిళ్ల అనంతరం చెత్తను తొలగించేందుకుగాను ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి రూ. 8.14 లక్షల బిల్లును పంపినట్లు అధికారులు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top