ఉప్మా హాట్‌బాక్సుల్లో రూ.1.29 కోట్లు | Rs.1.29 crore in Upta HotBox | Sakshi
Sakshi News home page

ఉప్మా హాట్‌బాక్సుల్లో రూ.1.29 కోట్లు

Aug 8 2017 1:15 AM | Updated on Sep 11 2017 11:31 PM

ఉప్మా ముసుగులో దుబాయ్‌కు రూ.1.29 కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను పుణే విమానాశ్రయంలో

న్యూఢిల్లీ: ఉప్మా ముసుగులో దుబాయ్‌కు రూ.1.29 కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను పుణే విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పుణే నుంచి దుబాయ్‌ వెళ్తున్న నిషాంత్‌ అనే వ్యక్తి డాక్యుమెంట్లు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు అతని లగేజ్‌ను తనిఖీ చేశారు.

లగేజ్‌లో హాట్‌బాక్సు ఉండాల్సిన బరువుకంటే అధికంగా ఉండడంతో పరిశీలించగా..ఉప్మా కింద 86,600 అమెరికా డాలర్లు, 15,000 యూరోలు బయటపడ్డాయి. దుబాయ్‌కి అదే విమానంలో వెళ్తున్న ఓ మహిళ లగేజ్‌ నుంచి ఉప్మా హాట్‌బాక్సులో దాచిన 86,200 డాలర్లు, 15,000 యూరోలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement