జైలుకు పంపడం కాదు అతణ్ణి ఉరితీయాలి! | Rocky Yadav must be hanged, says Victim father | Sakshi
Sakshi News home page

జైలుకు పంపడం కాదు అతణ్ణి ఉరితీయాలి!

May 10 2016 2:34 PM | Updated on Apr 6 2019 8:51 PM

జైలుకు పంపడం కాదు అతణ్ణి ఉరితీయాలి! - Sakshi

జైలుకు పంపడం కాదు అతణ్ణి ఉరితీయాలి!

చేతికందివచ్చేందుకు సిద్ధంగా ఉన్న చెట్టంతా కొడుకు అకారణంగా ఒక దుర్మార్గానికి బలైతే.. ఆ తండ్రి వేదన ఎంత దీనంగా ఉంటుందో.. ఆదిత్య సచ్ దేవ్ తండ్రిని చూస్తే తెలుస్తుంది.

చేతికందివచ్చేందుకు సిద్ధంగా ఉన్న చెట్టంతా కొడుకు అకారణంగా ఒక దుర్మార్గానికి బలైతే.. ఆ తండ్రి వేదన ఎంత దీనంగా ఉంటుందో.. ఆదిత్య సచ్ దేవ్ తండ్రిని చూస్తే తెలుస్తుంది. ఎమ్మెల్సీ కొడుకు చేతిలో తన తనయుడు దారుణ హత్యకు గురయ్యాడన్న వార్త తెలిసి గుండె పగిలిన ఆయన తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బంధువులు, కుటుంబసభ్యులు ఎంత ఓదార్చాలని ప్రయత్నిస్తున్నా.. ఆయన దుఃఖాన్ని ఆపడం వారి వశమవ్వడం లేదు.

తన కొడుకును హత్య చేసిన ఎమెల్సీ కొడుకు రాకీకుమార్ యాదవ్ ను ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. అతడిని అరెస్టు చేసి జైలుకు పంపితే.. కేవలం ఆరు నెలల్లోనే బయటకొస్తాడని అన్నారు. ఈ కేసులో వేగంగా దర్యాప్తు జరుపాలని, రాకీకుమార్ ను ఉరితీస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన పేర్కొన్నారు.

తన వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడన్న కోపంతో జేడీయూ ఎమ్మెల్సీ మనోరమదేవి తనయుడు రాకీ యాదవ్ ఆదిత్య సచ్ దేవ్ ను కాల్చిచంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తాను ఆదిత్యను కాల్చలేదని, తనకు ఈ ఘటనతో ప్రమేయం లేదని నిందితుడు చెప్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement