
బంగారు రుణాలపై నిబంధనలు సరళీకరణ
రిజర్వ్ బ్యాంక్ బంగారు రుణాల మంజూరుపై నిబంధనలను సరళీకరించింది.
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ బంగారు రుణాల మంజూరుపై నిబంధనలను సరళీకరించింది. బంగారు నగలపై గరిష్ఠ రుణపరిమితి లక్ష రూపాయిలుగా నిబంధనను తొలగించింది. రుణాల చెల్లింపు వ్యవధిని 12 నెలలుగా ఆర్బీఐ నిర్దేశించింది.
బంగారం విలువలో 75 శాతం వరకు రుణాలను మంజూరు చేయాలని ఆర్బీఐ సూచించింది. బ్యాంకుల విజ్ఞప్తి మేరకు ఆర్బీఐ ఈ నిబంధనల్లో మార్పులు చేసింది. వ్యవసాయేతర రుణాలకు ఇది వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది.