కరోనాపై పోరుకు ‘టాటా’ విరాళం 1,500కోట్లు..

Ratan Tata pledges Rs 500 crore to fight coronavirus - Sakshi

కరోనాపై యుద్ధానికి టాటా గ్రూప్‌ శనివారం భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది. అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్‌’ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్‌ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది.

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారిపై యుద్ధానికి టాటా గ్రూప్‌ శనివారం భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది. అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్‌’ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్‌ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది.

కరోనా వైరస్‌ పీడితులకు అవసరమైన వెంటిలేటర్లను సాధ్యమైనంత త్వరగా అందజేస్తామని చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. వాటిని తయారు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. దేశంలో.. ప్రపంచంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేగవంతమైన నివారణ చర్యలు అవసరమన్నారు. కరోనా నివారణకు టాటా ట్రస్టుతో కలిసి పని చేస్తామన్నారు.  

కరోనా నివారణతోపాటు సహాయక కార్యకలాపాలకు రూ.500 కోట్ల విరాళాన్ని టాటా ట్రస్టు ప్రకటించింది. తాము ఇవ్వనున్న రూ.1,000 కోట్లతో డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు, కరోనా టెస్టింగ్‌ కిట్లు అందజేయనున్నట్లు టాటా సన్స్‌ తెలిపింది. కరోనాను అరికట్టే విషయంలో తక్షణమే స్పందించాల్సిన సమయం వచ్చిందని టాటా ట్రస్టు చైర్మన్‌ రతన్‌ టాటా వ్యాఖ్యానించారు. మానవ జాతి ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లలో కరోనా కూడా ఒకటని తెలిపారు.   

రూ.కోటి చొప్పున బీజేపీ ఎంపీల ఎంపీల్యాడ్స్‌
కరోనాపై పోరులో ప్రభుత్వానికి సాయపడేందుకు తమ పార్టీ ఎంపీలు రూ.1 కోటి చొప్పున ఎంపీల్యాడ్స్‌ కేటాయించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఒక నెల వేతనం విరాళంగా అందిస్తారని తెలిపారు. దీంతోపాటు తమ పార్టీ కార్యకర్తలు లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడే 5 కోట్ల నిరుపేదలకు 21 రోజులపాటు అన్నదానం చేస్తుందన్నారు. బీజేపీకి లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 386 మంది సభ్యులున్నారు. ఒక్కో ఎంపీకి ఎంపీల్యాడ్స్‌ కింద ఏడాదికి రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసే వీలుంది. కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు తన ఒక నెల వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా, ఎంపీలంతా తమ ఎంపీల్యాడ్స్‌ నుంచి రూ.కోటి విరాళంగా అందించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులను కోరారు.

సన్‌ఫార్మా రూ.25 కోట్లు:  కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సన్‌ ఫార్మా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ముందుకు వచ్చింది. కరోనా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు రూ.25 కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌ తదితర మం దులు, శానిటైజర్లను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.  

అత్యాధునిక వెంటిలేటర్లు అందిస్తాం: హ్యుండయ్‌
కరోనాపై పోరుకు దక్షిణ కొరియాలో వినియోగిస్తున్న అత్యాధునిక పరీక్ష కిట్లను అందించనున్న హ్యుండయ్‌ మోటార్స్‌ ప్రకటించింది. ఇవి 25 వేల మందికి ఉపయోగపడతాయని తెలిపింది.   

ఒకరోజు వేతనం ఇవ్వండి: జీఎస్‌ఐ
కరోనాపై పోరులో సర్కారుకు బాసటగా నిలిచేందుకు ప్రధానమంత్రి సహాయ నిధికి ఒక రోజు వేతనం విరాళంగా ఇవ్వాలని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) తన ఉద్యోగులను కోరింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆరు జోన్ల అధిపతులకు వినతులు పంపినట్లు జీఎస్‌ఐ డీజీ శ్రీధర్‌ తెలిపారు.  

కావాలంటే వెంటిలేటర్లు సరఫరా చేస్తాం: ట్రంప్‌
కరోనాపై పోరులో మిత్ర దేశాలకు సాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముందుకు వచ్చారు. వెంటిలేటర్లు, ఇతర వైద్య సామగ్రి ఉత్పత్తిని దేశీయంగా పెంచడంతోపాటు అవసరమైన దేశాలకు వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కరోనా బారినపడిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో తాను ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపిన ట్రంప్‌.. వెంటిలేటర్లు పంపించాలన్న ఒకే ఒక కోరికను బోరిస్‌ ఈ సందర్భంగా వెల్లడించారని వ్యాఖ్యానించారు. రానున్న 100 రోజుల్లో తమ కంపెనీలు లక్ష వెంటిలేటర్లను ఉత్పత్తి చేయనున్నాయన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

04-06-2020
Jun 04, 2020, 00:37 IST
లండన్‌: ఫార్ములావన్‌  (ఎఫ్‌1) రేసుల్లో పాల్గొనేందుకు వచ్చిన డ్రైవర్లలో ఎవరికైనా కరోనా సోకినా... పోటీ మాత్రం ఆగదని ఎఫ్‌1 సీఈఓ...
04-06-2020
Jun 04, 2020, 00:26 IST
కరోనా వైరస్‌ మహమ్మారిపై మన దేశం ఎడతెగకుండా పోరు సాగిస్తున్నా ఆ కేసుల సంఖ్య 2,07,000 దాటిపోయింది. ఆ వైరస్‌...
03-06-2020
Jun 03, 2020, 21:02 IST
తెలంగాణలో కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు.
03-06-2020
Jun 03, 2020, 18:04 IST
పనాజి: దేశంలో క‌రోనా విజృంభణ త‌క్కువ‌గా ఉన్న‌ గోవాలో బుధ‌వారం ఒక్క‌రోజే పెద్ద మొత్తంలో కేసులు వెలుగు చూడ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం...
03-06-2020
Jun 03, 2020, 17:36 IST
ఢిల్లీలో చిక్కుకుపోయిన 33 మంది వలస కార్మికులను విమానంలో తీసుకెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేశారు.
03-06-2020
Jun 03, 2020, 16:47 IST
కలకత్తా: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని పశ్చిమ...
03-06-2020
Jun 03, 2020, 15:57 IST
లండన్‌ : ప్రపంచంలో ఏ దేశమైనా సరే తల్లి ప్రేమ అనేది మాత్రం వెలకట్టలేనిది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వైద్యసిబ్బంది తమ...
03-06-2020
Jun 03, 2020, 14:16 IST
వాషింగ్టన్‌ : ఈ ఏడాది చివరికి కరోనాకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని యూఎస్‌ ఆర్మీ వ్యాక్సిన్‌ పరిశోధకులు వెల్లడించారు. సంవత్సరాంతానికి...
03-06-2020
Jun 03, 2020, 13:33 IST
రాజాపేట(ఆలేరు) : యాదాద్రి జిల్లాలో తొలి కరోనా మరణంనమోదైంది. జిల్లా రాజాపేట మండలం దూదివెంకటాపురం గ్రామంలో వైరస్‌ అంటుకుని ఓ...
03-06-2020
Jun 03, 2020, 13:09 IST
కర్ణాటకలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది
03-06-2020
Jun 03, 2020, 12:50 IST
సాక్షి, విజయవాడ : కరోనా వైద్య పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో మైలురాయిని చేరుకుంది. బుధవారం నాటికి  4 లక్షల టెస్టులు చేసిన...
03-06-2020
Jun 03, 2020, 12:19 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 8,066 కరోనా పరీక్షలు నిర్వహించగా, 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 35...
03-06-2020
Jun 03, 2020, 12:00 IST
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్నప్పటికి వైరస్‌ వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 2...
03-06-2020
Jun 03, 2020, 11:25 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇలాంటి సమయంలో వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం...
03-06-2020
Jun 03, 2020, 11:13 IST
జడ్చర్ల: మండలంలోని మల్లెబోయిన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ వ్యక్తి...
03-06-2020
Jun 03, 2020, 08:49 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ గురించి ప్రపంచాన్ని హెచ్చరించిన కంటి వైద్యుడు లి వెన్లియాంగ్‌తో కలిసి వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రిలో పని...
03-06-2020
Jun 03, 2020, 08:38 IST
గాంధీఆస్పత్రి: కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్రమాదం త్రుటిలో తప్పింది. తిరుగుతున్న సీలింగ్‌ ఫ్యాన్‌ హఠాత్తుగా ఊడి...
03-06-2020
Jun 03, 2020, 08:26 IST
స్నేహితులతో కలిసి జనవరిలో ఆఫ్రికాకు వెళ్లి మార్చి 20న హైదరాబాద్‌కు వచ్చాను. మార్చి 31న గాంధీ ఆస్పత్రికి వైద్య పరీక్షల...
03-06-2020
Jun 03, 2020, 08:01 IST
ప్రతిష్టాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ పర్యటనలనునిర్వహించే ఐఆర్‌సీటీసీ కోవిడ్‌ దెబ్బకు కుదేల్‌ అయింది.లాక్‌డౌన్‌ కారణంగా ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు పూర్తీగా రద్దయ్యాయి. ప్రస్తుతం...
03-06-2020
Jun 03, 2020, 04:41 IST
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతంతో పోల్చితే రాష్ట్రంలో ఆ సంఖ్య చాలా ఎక్కువగా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top