రాంపాల్పై కోర్టు ధిక్కార కేసు! | Rampal reaches high court; to face contempt proceedings | Sakshi
Sakshi News home page

రాంపాల్పై కోర్టు ధిక్కార కేసు!

Nov 20 2014 2:12 PM | Updated on Mar 19 2019 9:15 PM

రాంపాల్పై కోర్టు ధిక్కార కేసు! - Sakshi

రాంపాల్పై కోర్టు ధిక్కార కేసు!

ఇన్నాళ్లుగా మెర్సిడిస్ బెంజిలు, బీఎండబ్ల్యులలో తప్ప తిరగని .. వివాదాస్పద బాబా రాంపాల్ను పోలీసులు సాధారణంగా ఖైదీలను తరలించే ట్రక్కులోనే జైలుకు తీసుకెళ్లారు.

ఇన్నాళ్లుగా మెర్సిడిస్ బెంజిలు, బీఎండబ్ల్యులలో తప్ప తిరగని .. వివాదాస్పద బాబా రాంపాల్ను పోలీసులు సాధారణంగా ఖైదీలను తరలించే ట్రక్కులోనే జైలుకు తీసుకెళ్లారు.ఆయన పై మరో కేసు పెండింగులో ఉంది. ఇప్పటివరకు హత్య, ఫోర్జరీ, ఇతర కేసులు మాత్రమే ఉన్నాయనుకుంటే.. ఇప్పుడు కోర్టు ధిక్కార కేసు కూడా విచారణకు వస్తోంది. ఆయనను గురువారం మధ్యాహ్నం కట్టుదిట్టమైన భద్రత మధ్య పంజాబ్ హర్యానా హైకోర్టుకు తీసుకొచ్చారు.

2006లో జరిగిన హత్యకేసులో రాంపాల్ బెయిల్ను హైకోర్టు ఇంతకుముందు రద్దు చేసిన విషయం తెలిసిందే. పంచకులలోని ఓ ప్రభుత్వాస్పత్రి నుంచి రాంపాల్ను పోలీసు లాకప్కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement