ముస్లింలూ రాముడిని ఆరాధిస్తారు : రాందేవ్‌ బాబా | Ramdev Baba Says Lord Ram Revered By Muslims Too | Sakshi
Sakshi News home page

ముస్లింలూ రాముడిని ఆరాధిస్తారు : రాందేవ్‌ బాబా

Nov 16 2019 7:12 PM | Updated on Nov 16 2019 7:18 PM

Ramdev Baba Says Lord Ram Revered By Muslims Too - Sakshi

దేశంలో ముస్లింలూ శ్రీరాముడిని ఆరాధిస్తారని యోగా గురు రాందేవ్‌ బాబా అన్నారు.

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో 99 శాతం ముస్లింలు మత మార్పిడికి గురైనవారేనని యోగా గురు రాందేవ్‌ బాబా అన్నారు. ముస్లింలూ శ్రీరాముడిని గౌరవిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. రాముడు కేవలం హిందువులకు మాత్రమే కాదని, ముస్లింలకూ ఆరాధ్యుడని పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వెసులుబాటు కల్పిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై వ్యాఖ్యానిస్తూ తాను దీన్ని జాతీయ సమైక్యతా కోణంలో చూస్తానని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాందేవ్‌ మాట్లాడుతూ అయోధ్యలో రామాలయం హిందువుల సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుందర కట్టడంగా, భారతీయుల కలలు సాకారం చేసే రీతిలో మందిర నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. క్యాథలిక్‌లకు వాటికన్‌, ముస్లింలకు మక్కా, సిక్కులకు స్వర్ణ మందిరం ఎలాగో హిందువులకు అయోధ్య అటువంటిదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement