‘అధికారంలోకి వస్తే ఆ చట్టం మరింత పటిష్టం’

Rajnath Says Sedition Law Will Be Made More Stringent If BJP Is Voted Back To Power   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశద్రోహం చట్టాన్ని తొలగిస్తామని కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో పొందుపరచడం పట్ల కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే దేశద్రోహ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కులులో గురువారం ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ జాతి వ్యతిరేక శక్తుల వెన్నులో వణుకుపుట్టేలా దేశద్రోహం చట్టాన్ని పటిష్టం చేస్తామని చెప్పారు.

నిత్యావసర ధరలు పెరగకుండా బీజేపీ ప్రధానులు వాజ్‌పేయి, మోదీ నియంత్రించడంతోనే ద్రవ్యోల్బణం ఎన్నికల అంశం కాలేదని చెప్పుకొచ్చారు. కాగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్ధానాలకు మే 19న తుది దశలో పోలింగ్‌ జరగనుండగా, ఈనెల 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top