విదేశాల్లో ఉన్న వారిని తీసుకొచ్చేలా చర్యలు

Rajiv Gauba Video Conference With State Chief Secretarys - Sakshi

సీఎస్‌లతో రాజీవ్‌ గాబా వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో ఆదివారం వీడియో  కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా  రెడ్, ఆరెంజ్ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అలాగే దేశ వ్యాప్తంగా అమలువుతున్న లాక్‌డౌన్‌పై ఆయన ఆరా తీశారు. రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే అంశంపై విదేశీ వ్యవహారాలు, హోం శాఖల అధికారులు రాష్ట్రాలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

వీడియో సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్,కొవిడ్ కంట్రోల్ రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ మరియు ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్, పరిశ్రమల శాఖ కమీషనర్ సుబ్రహ్మణ్యం, ఐజి వినీత్ బ్రిజ్లాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలను వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top