వలస కూలీలను అవమానపరిచినందుకు..

Railway Officer In UP Throws Biscuits At Migrants And Abuses Them - Sakshi

ఫిరోజాబాద్‌ : వలస కార్మికుల పట్ల  చిన్నచూపుతో వ్యవహరించిన సీనియర్‌ రైల్వే అధికారిని సస్పెండ్‌ చేసిన ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గత సోమవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. డికె దీక్షిత్‌ ఫిరోజాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చీఫ్‌ టికెట్‌ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా గత సోమవారం దీక్షిత్‌ పుట్టినరోజు సందర్భంగా తన టీంతో కలిసి ఫిరోజాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అయితే దీక్షిత్‌ పుట్టినరోజు సందర్భంగా బిస్కెట్‌ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇంతలో వలసకూలీలకు సంబంధించిన శ్రామిక్‌రైలు అక్కడికి చేరుకొంది.దీక్షిత్‌ వారికి కూడా బిస్కెట్‌ ప్యాకెట్లు ఇవ్వాలని తన టీంకు తెలిపాడు. (విశాఖ జిల్లాలో విషాదం)

అయితే టీం సభ్యులు బిస్కెట్‌ పాకెట్లను వారి చేతికి అందివ్వకుండా బిస్కెట్‌ పాకెట్లను చింపి ఒక్కో బిస్కెట్‌ను కంపార్ట్‌మెంట్‌లోకి విసిరారు. ఈ సందర్భంగా దీక్షిత్‌ టీంలోని సభ్యుడు గట్టిగా అరుస్తూ..' ఈరోజు మా సార్‌ దీక్షిత్‌ పుట్టినరోజు. అందుకే బిస్కెట్లు పంచుతున్నాం' అంటూ పేర్కొన్నాడు. అయితే వలస కూలీలు మరికొన్ని బిస్కెట్‌ పాకెట్లు ఇవ్వాలని కోరితే మీకు ఇచ్చిన దాంట్లోనే సరిపెట్టుకొండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అంతేగాక కిందపడిన బిస్కెట్లు వేస్ట్‌ కాకుండా తీసుకొని తినేయండి అంటూ వలసకూలీల పట్ల అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా రైల్వే స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇది కాస్తా అక్కడి లోకల్‌ ఆఫీసర్‌ తన వాట్సప్‌ గ్రూఫ్‌లో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది.('పటాసులు కాల్చండి.. డ్రమ్ములు వాయించండి')

విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు దీక్షిత్‌తో పాటు అతనితో ఉన్న టీమ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది.వలసకూలీలపై అవమానకరంగా ప్రవర్తించడంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ తన ట్విటర్‌లో పేర్కొంది. సరిగ్గా వారం కిందట ఓల్డ్‌ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆహరం కోసం వలసకూలీలు ఒకరిని ఒకరు తోసుకున్న సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్పందించింది. వలసకూలీలపై వివక్ష చూపిస్తూ రైల్వే అధికారులు ఇలా చేయడం దారుణం అని అభివర్ణించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్‌ రైల్వేశాఖ అధికారులను కోరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top