రైల్వే అధికారులకు బలవంతపు ఉద్యోగ విరమణ

Railway Department forced to 32 officers retire - Sakshi

న్యూఢిల్లీ: భారత రైల్వే చెందిన 32 మంది అధికారులతో రైల్వేశాఖ బలవంతపు పదవీ విరమణ చేయించింది. ఈ అధికారులు అంతా 50 ఏళ్ల వయసు వారే. అసమర్థత, సందేహాస్పద తీరు వంటి కారణాలతో వీరితో విరమణ చేయించినట్లుగా  రైల్వేశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల పనితీరును, సామర్థ్యాన్ని సమీక్షించేందుకు గాను వేసిన కమిటీ ఇటీవల రైల్వే శాఖకు ఓ నివేదికను అందజేసింది. అందులో 1,780 మంది ఉద్యోగుల పనితీరును సమీక్షించిన కమిటీ ఈ 32 మంది ఉద్యోగులను ముందస్తు ఉద్యోగ విరమణకు ప్రతిపాదించిందని తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top