'నేను ఆమెకు అన్యాయం చేయలేదు' | Rahul Raj Singh questioned for fourth consecutive day | Sakshi
Sakshi News home page

'నేను ఆమెకు అన్యాయం చేయలేదు'

Apr 17 2016 4:37 PM | Updated on Nov 6 2018 7:56 PM

'నేను ఆమెకు అన్యాయం చేయలేదు' - Sakshi

'నేను ఆమెకు అన్యాయం చేయలేదు'

'బాలికా వధు' ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ ను పోలీసులు మరోసారి ప్రశ్నించారు.

ముంబై : 'బాలికా వధు' ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ ను పోలీసులు మరోసారి ప్రశ్నించారు. మానసిక అనారోగ్యానికి గురైన కారణంగా రాహుల్ను ప్రస్తుతం అరెస్ట్ చేయకుండానే విచారణ కొనసాగించాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్కు హాజరైన రాహుల్ను గంటపాటు ప్రశ్నించారు.
 
'నేను అమాయకుడిని, ప్రత్యూషకు ఎటువంటి అన్యాయం చేయలేదు' అంటూ రాహుల్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ సారి పోలీసులు ప్రత్యూష బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ప్రశ్నించారు. 'ఆమె ఆర్థికపరమైన సమస్యల్లో ఉంది. ఈ విషయంలో  మా మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి.. అయితే అది ఏ బంధంలోనైనా సాధారణమైన విషయమే కదా' అంటూ రాహుల్ బదులిచ్చాడు.
 
ఇక స్టేషన్ బయట మీడియాతో మాట్లాడుతూ.. 'నేనిప్పుడిప్పుడే కోలుకుంటున్నాను, గతం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను. సరైన సమయం వచ్చినప్పుడు నేనే మీ ముందుకొచ్చి మాట్లాడతాను, నిజానిజాలు తప్పకుండా బయటపడతాయి' అంటూ అక్కడి నుంచి తిరిగి హాస్పిటల్కు వెళ్లిపోయాడు. కాగా ప్రత్యూష తండ్రి.. రాహుల్ కు చికిత్స  అందిస్తున్న శ్రీసాయి హాస్పిటల్ మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. డబ్బు తీసుకుని అక్కడి వైద్యులు రాహుల్ ని పరోక్షంగా కాపాడుతున్నారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement