కరుణకు రాహుల్, రజనీ పరామర్శ

Rahul Gandhi Visits DMK Chief M Karunanidhi In Hospital - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్యం మంగళవారం మరింత మెరుగుపడింది. నాలుగు రోజులుగా దేశవాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన కరుణ కాసేపు కళ్లు తెరిచారు. కుమారుడు స్టాలిన్‌ పలకరింపునకు స్పందించారు. వృద్ధాప్య రుగ్మతలతో సతమతం అవుతున్న కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించడంతో గతనెల 28న ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. గొంతుకు అమర్చిన కృత్రిమశ్వాస గొట్టాన్ని మార్చిన కారణంగా ఆయన ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ఆనాటి నుంచి స్పృహలేని స్థితిలో ఉండిన కరుణానిధి క్రమేణా కోలుకుంటున్నారు.

ఇదిలాఉండగా, కరుణను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం కావేరీ ఆస్పత్రికి వచ్చారు. కరుణ కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమొళి రాహుల్‌ను కరుణ వద్దకు తీసుకెళ్లారు. ఈ సమయంలో స్టాలిన్‌.. కరుణ చెవివద్ద ‘రాహుల్‌ వచ్చారు’ అని చెప్పగా కళ్లు తెరిచి తలతిప్పి చూశారు. అలాగే, నటుడు రజనీకాంత్‌తోపా టు పలువురు తమిళ చిత్రరంగ ప్రముఖులు కావేరి ఆస్పత్రి వచ్చి కరుణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరుణ ఆరోగ్యం మరింత మెరుగుపడినా మరికొంతకాలం ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని కావేరి ఆస్పత్రి బులెటిన్‌లో పేర్కొంది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top