
సాక్షి, అహ్మదాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష భాధ్యతలు చేపట్టనున్న రాహుల్ గాంధీ మరోసారి గుజరాత్‌లో ఆలయాల సందర్శన చేశారు. ప్రధానంగా అహ్మదాబాద్‌లోని ప్రఖ్యాత జగన్నాథ్ ఆలయాన్నిరాహుల్ గాంధీ సందర్శించారు. ఆలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు రాహుల్ గాంధీకి స్వామివారి పూలమాల, శాలువా బహూకరించారు.
ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గుజరాత్‌లోని పలు ఆలయాలను సందర్శించారు. ప్రధానంగా సోమనాథ్ ఆలయం, ద్వారకదేష్, చోటీలా, జలరామ్ బాపా ఆలయాలను రాహుల్ దర్శించారు. రాహుల్ ఆలయాల సందర్శనపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్‌పార్టీ ఓట్ల కోసమే ఇలా చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా హిందూ అనుకూల వాదాన్ని అనుసరిస్తోందన్న సంకేతాలను ఇచ్చేలా రాహుల్ గాంధీ ఆలయాల సందర్శన ఉందనే విమర్శలు వచ్చాయి.