నోర్మూయండీ.. ఆవేశంగా లేచిన రాధేమా! | Radhe Maa gets angry and fire on media | Sakshi
Sakshi News home page

నోర్మూయండీ.. ఆవేశంగా లేచిన రాధేమా!

Oct 27 2017 6:02 PM | Updated on Oct 27 2017 6:41 PM

Radhe Maa gets angry and fire on media

సంభాల్‌: వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త రాధేమా(52) (అలియాస్‌ సుఖ్విందర్ కౌర్) సహనం కోల్పోయింది. విలేకరులు అడిగిన ప్రశ్నలతో ఆమె ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయింది. కల్కిమహోత్సవ్‌లో పాల్గొనేందుకు ఇ‍క్కడికి వచ్చిన ఆమెను మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరిచేశారు. దీంతో ఆమె సహనం కోల్పోయిన తన సీట్లోంచి లేచారు. నాపై ఎలాంటి ఆరోపణలు లేవు. అలాంటి ప్రశ్నలు నన్నెందుకు అడుగుతున్నారు? అంటూ విరుచుకుపడ్డారు. పక్కనే ఉన్న శిష్యగణం ఆమెను శాంతపరిచి తిరిగి సీట్లో కూర్చోబెట్టాల్సి వచ్చింది.

తూర్పు ఢిల్లీలోని వివేక్‌ విహార్‌ పోలీస్‌స్టేషన్‌కు ఇటీవల వచ్చిన రాధేమా స్టేషన్‌ అధికారి సీట్లో కూర్చోవటం పెను వివాదానికి దారి తీసిన విషయం విదితమే. అలాగే, తన శిష్యగణంలో ఒకరి కోడలిపై వరకట్నం వేధింపుల కేసులోనూ రాధేమా ప్రమేయం ఉందంటూ బాధితురాలి కుటుంబీకులు కేసు పెట్టారు. ఈ అంశాలపైనే విలేకరులు ఆమెను ప్రశ్నించగా మీరేమైనా పూలు కడిగిన ముత్యాలా? అలాంటి ప్రశ్నలను నన్నెందుకు అడుగుతున్నారు? నోళ్లు ముయ్యండంటూ వారికి రాధేమా ఎదురు తిరిగింది. కూర్చోలోంచి లేచి వెళ్లే ప్రయత్నం చేయగా ఆమె అనుచరులు శాంతపరిచారు. దీంతో కార్యక్రమం సజావుగా సాగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement