వైద్యం దైన్యం | Public health services in the country are very poor | Sakshi
Sakshi News home page

వైద్యం దైన్యం

Jun 27 2017 1:52 AM | Updated on Oct 16 2018 3:25 PM

వైద్యం దైన్యం - Sakshi

వైద్యం దైన్యం

వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు.

► దేశంలో ప్రభుత్వ వైద్య సేవలు అంతంత మాత్రమే
► వెయ్యి మందికి ఒక్క డాక్టర్‌ కూడా లేడు
► నర్సుల విషయంలోనూ అంతే..
► ఇతర దేశాలతో పోలిస్తే ఎంతో వెనుకబాటు


వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. కానీ మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వైద్యం అందని ద్రాక్షగానే మారింది. చాలా దేశాల్లో ప్రభుత్వ ఆసుపత్రులే ఎక్కువ సేవలు అందిస్తుండగా, మన దేశంలో మాత్రం ప్రైవేట్, కార్పొరేట్‌ రంగానిదే సింహ భాగం.

ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా అరకొరగానే సేవలు అందిస్తున్నాయి. భారత్‌లో ఇప్పటికీ దారిద్యరేఖకు దిగువన ఉన్నవారే ఎక్కువే. ఒక రోజుకు వీరు ఖర్చు చేసే సామర్థ్యం పట్టణ ప్రాంతాల్లో రూ.47 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.32 మాత్రమే. వీరంతా ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించలేక, ప్రభుత్వ వైద్యశాలలో వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నారు.

అందని వైద్యం
రోజురోజుకు అంటువ్యాధులతో పాటు ఇతర జబ్బులు మరింతగా ప్రబలుతున్నాయి. గుండె జబ్బులు,శ్వాసకోశ వ్యాధులు, మాతా, శిశు మరణాలు పెరిగిపోతున్నాయి. గుండె జబ్బులతో మృతి చెందుతున్న వారి సంఖ్యలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. వ్యాధులకు సరైన వైద్యం అందకపోవడం ప్రధాన కారణం. ప్రతి వెయ్యి మందికి యూఎస్‌లో 2.5 శాతం మంది డాక్టర్లు ఉండగా.. భారత్‌లో ఉంది 0.7 శాతమే. అంటే ప్రతి వెయ్యి మందికి దేశంలో ఒక్క వైద్యుడు కూడా లేడన్నమాట. అలాగే ప్రతి వెయ్యి మంది రోగులకు
అందుబాటులో ఉన్న నర్సులు యూఎస్‌లో 9.8 శాతం మంది కాగా.. భారత్‌లో 1.7 శాతమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement